OUR VALUES

TBFS VALUES

టి.బి.ఎఫ్.ఎస్ విలువలు

I ) శిష్యరికము లో కలసి నడచుట.

i)కలసి ప్రయాణించుట
a)టి.బి.ఎఫ్.ఎస్ లో కలసి ప్రయాణించవలసి ఊంటాది
b) కలసి ఉంన్నపుడు ఒకరి వలన ఒకరు బలపడగలరు
సామెతలు 27:17 ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును.

II) మన ప్రయాణము ( శిష్యరిక ప్రక్రియ )
a) చేరవలసిన గమ్యము ఎంత ముఖ్యమొ ప్రయాణము కూడా అంతే ముఖ్యము
b) ఎల్లప్పుడు నేర్చుకొనే తత్వమును స్వీకరించాలి
c) మన చెవులను హృదయాన్ని ఎల్లాప్పుడు అంగీకరించే స్తితిలో ఉంచుకోవాలి

(సామెతలు 4:20-23) 20. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. 21. నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగి పోనియ్య కుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము. 22. దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.23. నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము

                            d) మనము మనసుతో గ్రహించే స్తితి నుండి ఆత్మతో గ్రహించే స్తితికి మరియు మానవ తెలివితొ జీవించే స్తితి నుండిదేవుని జ్ఞనము తొ జీవించే స్తితి లో ఉండాలి . -- మన ఆలోచన కంటే సత్యము ఎన్నతగినది.

1 కొరింథీయులకు 2:9-15 --9. ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది. 10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. 11. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. 12. దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. 13. మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. 14. ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయ ములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. 15. ఆత్మసంబంధియైనవాడు అన్ని టిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింప బడడు.

                            e) మనము పట్టుకున్న సత్యాల్ని మన జీవితములొ ప్రభావితముగా అన్వయించుకోవాలి. ఎలయనగా సత్యము తానే మనలను విడుదల చేయదు గాని ఆ సత్యాని గ్రహించుటవలన జీవితములో అన్వయించుకొనుట వలన విడుదల పొందుతాము.

యోహాను సువార్త 8:21,32,36 --31. కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతోమీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;32. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా36. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.

III) మన గమ్యము ( శిష్యరిక లక్ష్యాలు )
1). నేను ఎవరి వలే మార్పు చెందుతున్నాను ?
రోమీయులకు 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.

                            a) నేను గమ్యము చేరటానికి దేవుడు చిత్తాన్ని నెరవేరుస్తున్ననా ?
హెబ్రీయులకు 12:1.ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున 2. మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు

ఎఫెసీయులకు 2:10. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

b).క్రైస్త జీవితము నెమ్మది,శాంతి,సాక్షాల సమ్మేళనములతో కట్టబడి క్రీస్తు కేద్ర బిందువై ఉండెడిది .
గలతీయులకు 5:22,23:- 22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.23. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.
2) సహవాసములో సంబందములు ఐక్యమత్యము కలిగి ఊండుట

i)సహవాసములో సంబందములు

                           a) ప్రతీ టి,భి.ఎఫ్.ఎస్ సభ్యున్ని సంఘ కార్యక్రాలలో, సెల్ గ్రూపులలో పాలిబాగస్తులై ఉండాలి మరియు నాయకులు మార్గధర్శకత్వ సంబందాలలో పాలిబాగస్తులై ఉండాలి .
b) జవాబుదారీతనం మరియు సహోదరుల సాక్షమును కాపాడుట .
హెబ్రీయులకు 13:17. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి

                             c) ప్రార్దన మరియు భావవ్యక్తీకరణ
ఎఫెసీయులకు 6:18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
d) నాయకులు సభ్యుల స్తితిగతులపై శ్రద్ధ కలిగి ఉండుట
సామెతలు 27:23. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము.

IV) సహవాసములో ఐక్యమత్యము .
a)చూచుటకు ఏకరీతిగ జీవించుట కాక ఆత్మలో ఐక్యత కలిగి జీవించుట.
ఎఫెసీయులకు 4:4. శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపువిషయమై యొక్కటే నిరీక్షణ
యందుండుటకు పిలువబడితిరి.

1 కొరింథీయులకు 12:4-6 :--4. కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే.5. మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే.6. నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే

                              b)ముఖ్యమైన విషయాన్ని ఎప్పుడూ ముఖ్యమైన విషయముగనే ఉంచాలి
c) ఎదురు దాడులు లేవు
1 కొరింథీయులకు 13:4-8 :- 4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;5. అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
జెకర్యా 8:17 :- 6. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.7. అన్ని టికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.8. ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;
సామెతలు 10:12 :-

d)ఎల్లప్పుడూ క్షమిస్తూ ఉండాలి , దేవునికి మహిమ తెచ్చుటకు సమస్యలను సంబందాలను పరిష్కరించటానికి ప్రేమతో వెంటాడాలి
e) ఖండించుట చేయము ,ఇతరులతో పోటీ పడము ,ఇతరులతో పోల్చుకోము కాని కాని హెచ్చరించి ఉజ్జీవపరిచెదము

f)ఐక్యమత్యము యాంత్రికముగా వచ్చేదికాదు ,దానికి ప్రయాస అవసరము
ఫెసీయులకు 4:3. ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.
g) కార్యక్రమము కన్న ప్రజలు ముఖ్యము, కనుక స్నేహమే కర్యక్రమానికి ప్రాధాన్యతనిస్తాది.
h) సంబందాలు ఏర్పడుటకు సమయము ప్రయాస అవసరము ,కలసి కట్టుటకుముందు సంబంద బాందవ్యము కలిగి ఊండాలి.

V)సేవలో దేవుని కొరకు ప్రత్యేకించబడుట Anointed in our Serving
i) వాక్యములో నాటబడి ఆత్మతో నడుపబడుట.
a)దేవునితో సంపూర్ణముగ నడుస్తు సేవచేస్తాము
b)ఉన్నదే సమర్పిస్తాము , శరీరము మీద నమ్మకము ఉంచము .
c) పరిశుద్దాత్మ నడిపింపు మార్గదర్షత్వము బట్టి సేవించుట
d)అన్నిటి కంటే దేవునిని ఆయన మాటను గట్టిగా పట్టుకొని ఊంటాము.
ii) పూర్తిగ పాల్గొనుట
a) ప్రతీ టి.భి.ఎఫ్.ఎస్ సభ్యుడు కు దేవుడు ఇచ్చిన తలాంతుల మరియు పిలుపు ప్రకారము పూర్తిగా పాల్గొనాలని ప్రోత్సహిస్తున్నాము
b)నాయకులను విస్తరించాలని ప్రోత్సహిస్తున్నము .(సెల్ గ్రూపు,సువార్త బృందములు ,సంగీత బృందములు ,ప్రార్దనా బృందములు మరియు ప్రోత్సహించే నాయకులు)
c) ఉంన్న సామర్థ్యముకొలది మాత్రమే సేవ చేయగలము,తదుపరి సామర్థ్యము (ఆత్మీయ ,మానసిక ,పెంచుటకు, శారీరిక మరియు భావోద్వేగ సామర్థ్యములు)కొరకు దేవునుని వెదకెదము.
d) చిన్నవాటిలో పెద్దవాటిలో నమ్మకముగా ఉండుట
e)లోతుగా మరియు వెడల్పుగా కట్టుటకు శ్రమపడుట

VI) సేవలో సూత్రాలు
a)మేము సమర్దవంతమైన చేతులతో ,నమ్మకమైన హృదముతో సేవ చేస్తాము.
కీర్తనలు 78:72. అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను.
b)మేము పద్దతుల వలన పని ఆపము గాని వాక్యానుసారముగ ప్రభావితముగ చేసెదము .
c) మేము పనికి ముందు ,పని సమయములో పని తరువాత ప్రార్దిస్తాము
d) ఆత్మీయ జీవితము ఎల్లప్పుడూ ప్రవహించాలి గాని ఒక వ్యక్తి లేక ఒక సంస్ద లేక ఒక గుంపు ను బట్టి ఆటంక పరచబడ కూడదు.

VII)సే వలో ప్రత్యేకించబడినవి
⦁ ఆభిషేకించ బడిన స్తుతి
⦁ ఆభిషేకించ బడిన వాక్యము
⦁ ఆభిషేకించ బడిన బలిపీటము
⦁ ఆభిషేకించ బడిన సంఘ జీవితము
⦁ ఆభిషేకించ బడిన మంచి పనులు

VIII). నిజమైన ఆరాధికునిగా తండ్రిని ఆనందపరచుట
i)దేవునిని ఆరాదించుటకు నిర్ణయము చేసుకొనుట
2 సమూయేలు 6:16-18 :- 16. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, సౌలు కుమార్తె యగు మీకాలు కిటికీలోనుండి చూచి, యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్య మాడుచు నున్న దావీదును కనుగొని, తన మనస్సులో అతని హీనపరచెను.17. వారు యెహోవా మందసమును తీసికొని వచ్చి గుడారము మధ్యను దావీదు దానికొరకు ఏర్పరచిన స్థలమున నుంచగా, దావీదు దహనబలులను సమాధానబలులను యెహోవా సన్నిధిని అర్పించెను.18. దహనబలులను సమాధానబలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి,

                                     a) నీవు దేవుని సన్నిదికి రాగలవు మరియు దేవుని సన్నిదిని కొల్పొ గలవు
b) కావలని దేవునిని ఆరదించుటకు రావాలి, ప్రేక్షకులు గా ఊండకూడదు.
ii)నిజమైన ఆరదికుడు గ ఉండు.
యోహాను సువార్త 4:23 23. అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరు చుంన్నాడు.

                                     a)ఆత్మతో ఆరదించుట అనగా మనలో ఉంన్న ఆత్మ పరిశుద్దాత్మ తొ కలవడమే.
b) సత్యముతో ఆరాదించుట అనగా దేవుని వాక్యముతో కడగబడి దాపరికము లేకుండ మనలను మనమే సమర్పించుకొనుచు ఆయన సన్నిడికి వచ్చుట.

XI).కావాలని దేవునికి ఇవ్వాలి
i) విత్తుట మరియు కోయుట అను సూత్రము మీ జీవితమును ప్రభావితము చేయనివ్వాలి.
a) విత్తనము విత్తుటకు మరియు రొట్టె మన అవసరము కొరకు
b) కావాలని విత్తనాలను నాటుటకు నేర్చు కోవాలి , ప్రార్దనా పూర్వకముగా ఇవ్వాలి

ii) కావాలని దేవునికి ఇవ్వాలి
a) అశీర్వదించబడిన వారు అనేకులకు అశీర్వాదము
b) దాతృత్వము కలిగి ఉండుడి, చిన్ని చిన్ని వాటి కొరకు బాదపడకుడి
c) నీరు ప్రవహించు గొట్టము తడిగానే ఉంటాది
X) వాక్యమును నమ్మి ఆ ప్రకారము వాక్యమునకు స్పందించవలయును .వాక్యమును నమ్మి స్పందిస్తే దేవుడు ఇచ్చిన వాక్యము విలువ తెలుస్తాది